పయనించే సూర్యుడు జులై 08 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి :కార్మిక, ఉద్యోగ, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 9న జరుగు దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ మంగళవారం టేకులపల్లి . బోడు లో విస్తృత ప్రచారం నిర్వహించాయి. టేకులపల్లి మండలంలోని ఎస్ బి ఐ. ప్రాథమిక సహకార సంఘం, డిసిసిబి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, పోస్ట్ ఆఫీస్,తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు డి ప్రసాద్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకు వస్తున్న కార్మిక, ఉద్యోగ, రైతంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే సమ్మె కేంద్ర ప్రభుత్వానికి ఒక గుణపాఠం కావాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక విధానాలను పార్లమెంట్ లో మెజారిటీ ఉందని అమలులోకి పూనుకుంటే దేశంలోని కార్మిక వర్గం ఎలా బుద్ధి చెబుతుందో ఈ సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలిసి రావాలని కోరారు.
ఎనిమిది గంటల పని విధానం రద్దుచేసి 10:00 గంటల పని చేయాలనే జీవో నెంబర్ 282 ను రద్దు చేయాలని అన్నారు. కాంట్రాక్టు, అవుట్, సోర్సింగ్ గ్రామపంచాయతీ వర్కర్స్ కు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కాంట్రాక్టు కార్మికులను. గ్రామపంచాయతీ కార్మికులను పేర్మినెంట్ చేయాలని అన్నారు. గ్రామపంచాయతీలో అమలవుతున్న మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం పట్టుదలతో సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు భూక్య హర్జ, మండల అధ్యక్ష కార్యదర్శులు ఎట్టి నరసింహారావు, గుగులోతు రామచంద్, ఆంగోతు బాలు, సి.పి.ఐ ఎం.ఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.