
పయనించే సూర్యుడు నవంబర్ 03 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
రెహమత్ నగర్ బోరబండ డివిజన్ల పరిధిలో గల స్థానిక నేతలతో ఎమ్మెల్యే ముఖాముఖి…
వార్డులలో అనుసరించాల్సిన వ్యూహాలపై స్థానిక నేతలతో సమాలోచనలు…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లో భాగంగా నియోజకవర్గ పరిధిలో గల రెహమత్ నగర్ బోరబండ డివిజన్ల లో స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలతో యూత్ కాంగ్రెస్ సభ్యులతో సమావేశం నిర్వహించి వార్డులలో అనుసరించాల్సిన వ్యూహాలపై స్థానిక నేతలకు దిశా నిర్దేశం చేసిన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య వారి వెంట ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బాణోత్ రాంబాబు కొండపల్లి సొసైటీ చైర్మన్ ధనియాకుల హనుమంతరావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తోటకూరి శివయ్య పత్తె మధు డివిజన్ పరిధిలో గల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
