పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 10,అశ్వాపురం : పి ఎం శ్రీ స్కూల్స్ ఎక్స్పోజర్ విజిట్ లో భాగంగా ఈ సంవత్సరం అశ్వాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థినీ విద్యార్థులను వైజ్ఞానిక సందర్శనకు తీసుకువెళ్లామని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యోగితా వేణి పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.ఈ సందర్శన నిమిత్తం శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం తీసుకువెళ్లామని అక్కడ లోయర్ సీలేరు హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ హౌస్ ను సందర్శించి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఎలా జనరేట్ అవుతుందనే విషయం అక్కడ సిబ్బంది ద్వారా విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. అనంతరం పొల్లూరు వాటర్ ఫాల్స్ ను సందర్శించి విద్యార్థిని విద్యార్థులకు సందర్శనా నిమిత్తం వారి అనుభవాలను నెమరు వేసుకొని ఉత్సాహంగా ఉల్లాసంగా సందర్శనను ముగించుకొని రావడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.