పయనించే సూర్యుడు న్యూస్ తాడిపత్రి ప్రతినిధి కుళ్లాయప్ప 6 నేడు టీడీపీ నేత జెసి పవన్ రెడ్డి ని హైదరాబాద్ లోని జె సి పవన్ రెడ్డి స్వగృహం నందు మాజీ మంత్రి శైలజానాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రాష్ట్రం జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులపై వారు గంట పాటు చర్చించినట్లు సమాచారం. శైలజానాథ్ ఇటీవల కర్నూలులో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఓ వేడుకలో కలవగా ఆయన వైసీపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది అనుకోకుండా టిడిపి నేత జేసీ పవన్ రెడ్డి ని ఈ క్రమంలో కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది మరి మాజీ మంత్రి శైలజనాథ్ వైసీపీలో చేరుతారా లేక టిడిపిలో చేరుతారని శైలజానాథ్ ప్రయాణం ఎటువైపు అని సింగనమల నియోజకవర్గం ప్రజలు ఎదురుచూస్తున్నారు