పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 కరీంనగర్ న్యూస్ : భారత రత్న, మహానీయ ఇంజనీరు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీరింగ్ డేను పురస్కరించుకొని అలాగే కరీంనగర్ జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక టీఎన్జీవోస్ సంఘ భవనంలో టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయిఈ కార్యక్రమం టీఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ వారి ఆధ్వర్యంలో జరిగింది ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జిల్లా నాయకులు గెజిటెడ్ అధికారుల సంఘం సభ్యులు పలు విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు ఈ సందర్భంగా టీఎన్జీవోల సంఘం నాయకులు దారం శ్రీనివాస్ రెడ్డి కి పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఆయన పోరాటస్ఫూర్తిని కొనియాడుతూ భవిష్యత్తులో మరింత బలంగా ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తారని ఆకాంక్షించారుఅదే విధంగా విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో సమాజ సేవలో మరింతగా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారుఅదేవిధంగా స్థానిక గర్ల్స్ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో గల ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు మరియు అరటిపండ్లు పంపిణీ చేయడం ద్వారా దానం శ్రీనివాస్ రెడ్డి తన జన్మదినాన్ని సేవా కార్యక్రమంగా మార్చుకున్నారు ఈ సందర్భంలో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారుఈ కార్యక్రమంలో టిఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళీ చరణ్ గౌడ్ కార్యదర్శి అరవింద్ రెడ్డి కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహ స్వామి రాగి శ్రీనివాస్ గూడ ప్రభాకర్ రెడ్డి సర్దార్ హర్మీందర్ సింగ్ సందీప్ హరికృష్ణ జిల్లా సహద్యక్షలు రవీందర్ రెడ్డి కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్ కార్యదర్శి వెలిచాల సుమంత్ రావు రూరల్ అధ్యక్షులు వాస్తవిక్ గౌడ్ కార్యదర్శి కోమ్మేర శ్రీనివాస్ రెడ్డి జిల్లా నాయకులు ఇరుమల్ల శారద రమేష్ గౌడ్ ప్రసాద్ రెడ్డి నగేష్ గౌడ్ సునిత శైలజ సుస్మిత సుధాకర్ రెడ్డి పోలు కిషన్ నాగరాజు వెంకట్ రెడ్డి అజ్గరుద్దిన్ పాండు రాజు నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోట రామస్వామి కార్యదర్శి శంకర్ నాగుల అనిల్ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు కేశవరెడ్డి లింగయ్య టీచర్ల హమీద్ రాజయ్య గౌడ్ లలిత మేరీ రెడ్డి స్వరూప నారాయణ రెడ్డి అల్లే శీను వంశీ పవన్ సంఘం నాయకులు కటకం రమేష్ ఖాజా తదితరులు పాల్గొన్నారు