
పయనించే సూర్యుడు తేదీ 01 నవంబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా బోయ కిష్టన్న.
జిల్లా కలెక్టర్ధర్మవరం బీసీ బాలుర వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన బి.ఎం. సంతోష్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు:కలెక్టర్ చర్య: కలెక్టర్ బి.ఎం. సంతోష్ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని, అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు.ఆరోగ్య పరిస్థితిపై ఆరా: విద్యార్థులకు అందుతున్న వైద్య చికిత్సల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ఆదేశించారు.విచారణ ఆదేశం: ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం.