
పట్టించుకోని సంబంధిత అధికారులు
దోపిడిని అరికట్టేది ఎవరు
ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్న దోపిడిదారులు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి.
నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండల సరిహద్దులో గల ప్రభుత్వ భూమి నుండి జోరుగా అక్రమ మొరం దందా నడుస్తుంది కానీ సంబంధిత అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వ భూమి నుండి చెట్లను నరికివేసి మరి మొరం దంద కొనసాగిస్తున్నారు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల భర్తీ వేసేందుకు మొరం దంద దోపిడీదారులు వందల నుండి వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు మరి ప్రభుత్వానికి ఆదాయం సున్నా ఇప్పుడైనా సంబంధాధికారులు చర్యలు తీసుకొని మొరం దందా ను అడ్డుకట్ట వేయాలని పేద ప్రజలకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
