
పయనించే సూర్యుడుD.30.7.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్. భీంగల్ మండల కేంద్రంలోఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ తహసిల్దార్ కిరణ్ కుమార్ గత సంవత్సరం ఇదే నెలలో కప్పల వాగు పొంగిపొర్లడంతో భీంగల్ మండల ప్రజలకు భారీ ప్రమాదం తప్పింది ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు తహసీల్దార్ కప్పల వాగు వంతెనను సందర్శించడం జరిగింది.ఈ పర్యటనలో ఆర్ ఐ మరియు రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేసి గతంలో జరిగిన సంఘటన పునారవృతం కాకుం ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.కప్పల వాగు అనుకుని ఉన్న గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని ఏవైనా ప్రమాద సూచికలు కనిపిస్తే వెంటనే రెవెన్యూ మరియు పంచాయతీరాజ్ సిబ్బందికి తెలియజేయాలని ఈ సందర్భంగా భీంగల్ ప్రజలను కోరినారు ఈ కార్యక్రమంలో ఆర్ ఐ మరియు ఏపీవో జీ నరసయ్య పాల్గొన్నారు..