
పయనించే సూర్యుడు న్యూస్ జులై 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కుకట్పల్లి నియోజికవర్గం ఆంజనేయ నగర్ సర్కిల్లో కైతలాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ కలికోట శంకర్ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్సార్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ కేక్ కట్ చేసి, వైయస్ఆర్ ఆశయాలను కొనియాడారు. సేవా కార్యక్రమం:వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని నిరుపేదలకు, మున్సిపల్ పరిశుద్ధ కార్మికులకి చీరల పంపిణీ చేయడం జరిగింది. ప్రజల కోసం నిరంతరం శ్రమించే పరిశుద్ధ కార్మికులకి గౌరవించుకోవడం సంతోషకరమని శంకర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.