చిరు వ్యాపారస్తులకు పి-4 పథకం హామీ
పయనించే సూర్యుడు సెప్టెంబరు :- 13జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ
కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట. జ్యోతుల నెహ్రూ షాపింగ్ కాంప్లెక్స్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్లకు రావులమ్మనగర్ టిడిపి కార్యాలయంలో ఘన సత్కారం జరిగింది.ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, గత 25 సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిరు వ్యాపారస్తులకు షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం ద్వారా 24 కుటుంబాలు లబ్ధి పొందినట్లు కృతజ్ఞతలు తెలిపారు. ఆశీర్వాద్ రియల్ ఎస్టేట్ కింతాడ రాజు మాట్లాడుతూ, జీవితాంతం ఈ సహకారానికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు.జ్యోతుల నవీన్ మాట్లాడుతూ, షాపులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యాపారస్తులకు ఎమ్మెల్యే సహకారంతో కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ 24 మంది వ్యాపారస్తులను ఒక్కొక్కరితో పరిచయం చేసుకుని వారి వ్యాపారాల గురించి వివరాలు తెలుసుకున్నారు.అందరికీ ప్రభుత్వం ద్వారా పి-4, ఆదరణ పథకం కింద స్వయం ఉపాధి కల్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్.వి.ఎస్. అప్పలరాజు, జీను మణిబాబు, కొత్త కొండబాబు, వాసిరెడ్డి ఏసుదాసు, పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, పాలచర్ల నాగేంద్ర చౌదరి, రాయి సాయి, సత్తి సదాశివరెడ్డి, గెద్దాడ సత్యవేణి, పీల మహేష్, సాంబత్తుల చంద్రశేఖర్, తుమ్మల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.