పయనించే సూర్యుడు. జనవరి 30. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
* నిర్దేశిత సమయంలోగా టిజి ఐపాస్ దరఖాస్తులను పరిష్కరించాలి .... స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ
* టీ-ప్రైడ్ ద్వారా 10 యూనిట్ల ఏర్పాటుకు 33 లక్షల 39 వేల పెట్టుబడి సబ్సిడీ
* జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించిన అదనపు కలెక్టర్
జిల్లాలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించేందుకు టిజి-ఐపాస్ క్రింద వచ్చిన దరఖాస్తులపై నిర్దేశిత సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించి పరిశ్రమల స్థాపన, టిజి ఐపాస్, టి - ప్రైడ్ పై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల అనుమతుల దరఖాస్తులను నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని అన్నారు. జిల్లాలో టీజి ఐపాస్ విధానం అమలవుతున్న తీరును అదనపు కలెక్టర్ ఆరా తీశారు. జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపనకు సంబంధించి వచ్చిన 22 ప్రతిపాదనలలో 15 ప్రతిపాదనలకు వివిధ శాఖల వారు జారీ చేసిన అనుమతులను, తిరస్కరించిన 3 ప్రతిపాదనలను అదనపు కలెక్టర్ సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న 4 ప్రతిపాదనలు సైతం తక్షణమే సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో టీ - ప్రైడ్ పథకం క్రింద నూతనంగా ఏర్పాటు చేసిన 10 ఎస్సీ, ఎస్టీ యూనిట్లకు 33 లక్షల 39 వేల 282 రూపాయల పెట్టుబడి సబ్సిడీని మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో జి.ఎం. పరిశ్రమల శాఖ టి. సీతారాం, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస రెడ్డి, జిల్లా హార్టికల్చర్ అధికారి మధుసూదన్, నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, రైస్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మ రాజేశ్వర రావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.