
పయనించే సూర్యుడు జనవరి 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం
రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గొలకోటి దొరబాబు, జిల్లా పార్టీ ఉపాద్యక్షులు తాడి నరశింహరావుల ఆధ్వర్యంలో ముమ్మిడివరం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని శుబ్రపరచి, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు…పవిత్రమైన లడ్డూ నెయ్యిని కల్తీ చేసిన దోషులను కటినంగా శిక్షించాలని ర్యాలీ నిర్వహించారు..ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ వ్యవస్థలంటే విలువలేని వైకాపా ప్రభుత్వం హద్ధులేని దోపిడీలు చేసిందని, అనేక అవకతవకలతో పరమపవిత్రమైన టిటిడి ఆలయం పవిత్ర దెబ్బతీసేలా వ్యవహరం చేసారని, నేడు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రస్తుత టిటిడి చైర్మన్ బి. ఆర్. నాయిడు ఆధ్వర్యంలో టిటిడి లో అన్ని వ్యవస్థలను సరిచెస్తూ, భక్తుల మనోభావాలకు పెద్ద పీట వేస్తూ పర్యవేక్షణ జరుగుందని నాయకులు పేర్కోన్నారు.ఈ కార్యక్రమంలో దొమ్మేటి రమణ కుమార్, టౌన్ టిడిపి అధ్యక్షులు కట్ట సత్తిబాబు, పొద్దోకు నారాయణరావు,ములపర్తి బాలకృష్ణ, సరిపెల్ల శ్రీను రాజు, సరిపెల్ల నాగరాజు,గొల్లపల్లి గోపి, యాళ్ల ఉదయ్, దివి మహాలక్ష్మి, మెండి కమల,అడబాల సతీష్ తాడి జానకిరామ్, గోదాసి గణేష్, నిమ్మకాయల విష్,కుమార్, విల్ల వీరాస్వామి నాయుడు, జాగు సత్తిబాబు, సురేష్, రామలింగేశ్వరరావు, దంగేటి శ్రీను,నరసింహమూర్తి, కాశి లాజర్, నీతి పూడి వంశీ, దాట్ల బాబు, కొత్తలంక ఎంపీటీసీ, బూరుగు కళ్యాణ్, పండు గారు,మొదలగువారు పాల్గొన్నారు
