
పయనించే సూర్యుడు నవంబర్ 27 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు డీఎస్పీ కే.వేణుగోపాల్ ఆధ్వర్యంలో టిట్కో భవనాలలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన ఆత్మకూరు పోలీసులు ఆత్మకూరు పట్టణంలోని టిట్కో భవనాల వద్ద నేటి తెల్లవారుజాము నుండి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డన్ సెర్చ్ నిర్వహించిన ఆత్మకూరు పోలీసులు. ఆత్మకూరు డిఎస్పీ కే.వేణుగోపాల్ ఆధ్వర్యంలో డివిజన్లోని సీఐలు,ఎస్ఐలు వారి సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ వారి ఆధార్ కార్డులను పరిశీలించి అనుమతులు లేని 19 స్కూటర్లను మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీ అనంతరం ఆత్మకూర్ డిఎస్పి కి వేణుగోపాల్ మాట్లాడుతూ తమ జిల్లా ఎస్పీ అజిత మేడం ఆదేశాలతో ఆత్మకూరు సిఐ గంగాధర్ తోపాటు డివిజన్ పరిధిలోని ఎనిమిది మంది ఎస్ఐలు 50 మంది కానిస్టేబుల్స్ తో ఈ తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు మత్తు పదార్థాల రవాణా అరికట్టడం మహిళల పట్ల జాగ్రత్తలు, పలు నేరాలు ఇతర వ్యవహారాలలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎటువంటి నేర కార్యక్రమాలు నిర్వహించకుండా జరగకుండా ముందస్తుగా సూచనలు చేయడం కోసమే ఈ తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. ఇటువంటి భవన సముదాయాలలో పరిచయం లేని వ్యక్తులు నేర ప్రవర్తన కలిగిన వారు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు వాటిని పరిశీలిస్తూ ఎటువంటి అనుమానం ఉన్న ఎడల వెంటనే సంబంధిత వ్యక్తుల వివరాలు పోలీసులకు తెలుపవలసిందిగా సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ఇంట్లో ఉంటున్న వారి ఆధార్ కార్డులను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.. ఇక్కడ నివసిస్తున్న వారికి పలు జాగ్రత్తలు సూచించారు.
