
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ రీజినల్ రీజియన్ కార్యాలయంలోని ఆర్ఎం కాన్ఫరెన్స్ హాల్లో అద్దె బస్సుల యజమానులతో నిజామాబాద్ రీజియన్ టి. జోస్నా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అద్దె బస్సుల నిర్వహణ, సేవల నాణ్యత, ప్రయాణికుల భద్రత, షెడ్యూల్ నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.అద్దె బస్సులు ఎస్ ఆర్ టి సి నిబందనల ప్రకారం సమయపాలనతో పాటు మంచి నిర్వహణలో ఉండాలని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆర్ఎం సూచించారు. అలాగే బస్సుల కండిషన్, డ్రైవర్ ప్రవర్తన, ట్రాఫిక్ నిబందనల పాటింపు ఎంతో ముఖ్యమని తెలిపారు.ఈ సమావేశంలో అద్దె బస్సుల యజమానులు తమ సమస్యలు, సూచనలను ఆర్ఎం దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆర్ఎం హామీ ఇచ్చారు. ఈ సమావేశం ద్వారా సంస్థకు, అద్దె బస్సుల యజమానులకు మద్య సమన్వయం మరింత బలపడుతుందని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో నిజామాబాద్ రీజియన్ మేనేజర్ టి. జోస్నా డిప్యూటీ రీజినల్ మేనేజర్ యస్.మధు సూదన్ ; పి.ఓ టి. పద్మజ , ఏ ఓ ఫ్రీ పరమాత్మ మరియు అద్దె బస్సుల యజమానులు పాల్గొన్నారు.నిజామాబాద్ ఆర్టీసీ కార్గో విభాగంలో వేలం రేట్లపై 50 శాతం తగ్గింపు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ వన్ డిపో కార్గో విభాగం ప్రయాణికుల సౌకర్య ర్థము ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది మర్చిపోయిన వస్తువుల వేలం రేట్లపై 50 శాతం తగ్గింపు ఇవ్వనట్లు నిజామాబాద్ వన్ డిపో మేనేజర్ తెలిపారు ఈ మేరకు ఈ నెల 23న నిజామాబాద్ బస్టాండ్ ప్రాంగణంలో నీ కార్గో ఆఫీస్ వద్ద మధ్యాహ్నం 3 గంటల వరకు వేలం కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ఈ అవకాశము ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు
