
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టి జి ఎస్ ఆర్ టి సి నిజామాబాద్ రీజియన్ మేనేజర్ కార్యాలయంలో డా. బాబు జర్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం రీజియన్ మేనేజర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించబడింది.ఈ సందర్భంగా డా. బాబు జర్జీవన్ రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పి ఓ మేడం , dy.SUP అధికారులు, సూపర్వైజర్లు మరియు సిబ్బంది పాల్గొని ఆయన ఆదర్శాలను కొనియాడారు. రీజియన్ కార్యాలయ సిబ్బంది సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ, సమాజ అభివృద్ధికి డా. జర్జీవన్ రామ్ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో అన్ని విభాగాల సిబ్బంది సమన్వయం విశేషంగా నిలిచింది.
