
పయనించే సూర్యుడు ఆగస్టు 8 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఐ పోలవరం మండలం టీ కొత్తపల్లి చిన్న వంతెన గ్రామంలో వేంచేసియున్న శ్రీ విజయ దుర్గ అమ్మవారికి గ్రామస్తులు మాతృమూర్తులు గాదిరాజు దేవి పోలిశెట్టి గోవిందరావుల ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాడం సారె తీసుకొని మేళ తాళాలతో ఊరేగింపుగా అమ్మవారి దేవాలయం చేరుకుని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి పసుపు కుంకుమ గాజులు పువ్వులు పండ్లు చీర రవిక చలివిడి పానకం వివిధ రకాల పిండి వంటలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచారకులు బొంతు కనకారావు మాట్లాడుతూ ఆషాడంలో అమ్మవారికి ఈ విధంగా సారె సమర్పించి విశేష పూజలు చేయడం వలన అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందన్నారు గుడి కేంద్రముగా సత్సంగము వారం వారం భజన నిర్వహించడం వలన గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని గ్రామం ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పెన్మేత్స సుభద్రమ్మ గంజా భాస్కర లక్ష్మి కొర్లపాటి సత్తిబాబు మట్ట నాగేశ్వరరావు పెన్మేత్స వరలక్ష్మి దొడ్డా కూడా దుర్గ కొర్లపాటి జ్యోతి మరియు భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.