ఫారం పాండు మునగ సాగుపలు నర్సరీల పరిశీలించిన జిల్లాఅడిషనల్ కలెక్టర్
పయనించే సూర్యుడు మే 21 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)/జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీమతి విద్యా చందన టేకులపల్లి మండలం సులానగర్ గ్రామం నందు ఉపాధి హామీ పని రైతు చింతారాములు ఫారం పాండ్ పనినీ పరిశీలించినారు మరియు కూలీలకు కనీస వేతనం గురించి మరియు సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు త్వరలో ఉపాధి శ్రామికులకు పనిముట్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపినారు.మరియు సులానగర్, లచ్చగూడెం, కిష్టారం కొప్పురాయి పేట్రం చిలక, ముత్యాలం పాడు క్రాస్ రోడ్ గ్రామపంచాయతీల నందు ఏర్పాటు చేసిన నర్సరీలను తనిఖీ చేసినారు సందర్భంగా సిబ్బందికి తగు సూచనలు చేసినారు, ఖాళీగా ఉన్న బ్యాగులను వెంటనే మొలకెత్తే విత్తనలను నాటాలని మొక్కలను వెంట వెంటనే షిఫ్టింగ్ గ్రేడింగ్ చేపించాలని సిబ్బందిని ఆదేశించినారు. కోయగూడెం గ్రామపంచాయతీ నందు మునగ సాగు చేస్తున్న రైతు పకీర తోటను పరిశీలించి రైతుతో సాగు గురించి అడిగి తెలుసుకున్నారు. దిగుబడి ఎక్కువ రావాలంటే వాడవలసిన మందులు గురించి రైతుకు పలు సూచన చేసినారు మరియు మండలంలో గ్రామాలలో ఏర్పాటుచేసిన ఇంకుడు గుంటలు నిర్మాణాలను పరిశీలించి ఇంకా ఎక్కువ మొత్తంలో ముఖ్యంగా నర్సరీలలో పార్కులలో విద్యాసంస్థలలో కార్యాలయంలో మరియు అవకాశం ఉన్న ప్రతి చోట ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసి అట్టి నిర్మాణాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసిందిగా సిబ్బందిని ఆదేశించినారు ప్రతి గ్రామపంచాయతీలో బోరు బావి వున్న ప్రతి రైతుకు కచ్చితంగా ఫారం పాండు నిర్మాణాలను ఏర్పాటు చేయాలని ఉపాధి సిబ్బందిని ఆదేశించినారు. మరియు కూలీలకు వేతన రేటు ప్రతి రోజు Rs 307 రూపాయలకు తగ్గకుండా పని చేయించాలని సిబ్బందిని ఆదేశించినారు పనిచేస్తున్న ప్రతి ఉపాధి శ్రామికుడు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఉపాధి సిబ్బంది ఎక్కువ స్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఏపీఓ కాళంగి శ్రీనివాస్, ఈసి తిరుపతయ్య, కార్యదర్శలు పవిత్ర, కవిత, కృష్ణ చైతన్య, సంజీవ్ , సాంకేతిక సహాయకులు ఈశ్వరి, చంద్మల్ క్షేత్ర సహాయకులు సత్యనారాయణ లకన్, పూర్ణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.