పయనించే సూర్యుడు మే 6 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మంజూరు అయిన లబ్దిదారుల ఇండ్లను సందర్శించి ఎంపిక చేసినటువంటి కుటుంబాలను పరిశీలించి అర్హులైన వారు త్వరలో ఇండ్లకు శంకుస్థాపన కార్యక్రమం ఉండనుందని వారు ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకొని 400 చదరపు అడుగులు తగ్గకుండా 600 చదరపు అడుగులు మించకుండా సంబంధిత అధికారులు ఇచ్చినటువంటి నమూనా ప్రకారం ఇండ్లను నిర్మించుకోవాలని వారు సూచించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అధికారులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు నిజమైన లబ్దిదారులను ఎంపిక చేయాలనీ ఎలాంటి లోటుపాటలు జరగకుండా ఎంపిక చేసే బాధ్యత కమిటీ సభ్యుల మీద, సంబందిత అధికారుల పైన ఉందని ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని దానిని అనుసరించే బాధ్యత అధికారులపైన ఉందన్నారు.మొదటి విడతలో ఇండ్లు మంజూరు కానీ వాళ్లు నిరాశ చెందవద్దని రెండో విడతల వారీగా అర్హులైన ప్రతీ కుటుంబానికీ ఇండ్లు ఇచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదంతో అడుగులు వేస్తుందని విడతల వారీగా అందరికి లబ్ది చేకూరుతుందని వారు హామీ ఇవ్వటం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గం నాయకులు కోరం సురేందర్ ఇంచార్జి ఎంపీడీఓ గాంధీ ,పంచాయతీ సెక్రటరీ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.