పయనించే సూర్యుడుజులై 08 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి: రాంపురం పంచాయితీ పాత తండా గ్రామానికి చెందిన భూక్య గాంధీ మునగ తోట పరిశీలనకు జిల్లా కల్లెక్టర్ జితేష్ వి. పాటిల్ సందర్శించారు. అనంతరం రైతులతో మాట్లాడారు.గలత సంవత్సరం గ్రామీణ ఉపాధి హామి పథకం క్రింద ఎకరానికి 1000 మొక్కలు మునగ వేసక అధిక లాభాలు పొందుతున్నారని. అలాగే మిగతా రైతులు ముందుకు వచ్చి పత్తి లో అంతర పంటగా, పామాయిలు వేసుకొని లబ్ది పొందాలని రైతులను కోరారు. అలాగే రైతులు తమ పొలాలలో నీరు నిల్వా ఉండే ప్రదేశంలో ఒక మీటరు వెడల్పు తో 'వి ' ఆకారంలో గుంటను తవ్వి, ప్రత్తి, మొక్కజొన్న వేరే ఇతర పంటల వ్యర్థాలను వేసి పాక్షికంగా కాలితే అది బొగ్గు తయారు అవుతుంది. దాన్నే బయోచార అంటారు. ఈ బొగ్గులను ఆవు మూత్రం పేడతో కలిపే వారం రోజులు మాగ బెడితే సేంద్రీయ ఎరువు తయారవుతుంది. దీన్ని పొలంలో చల్లుకుంటే ఎరువుగా ఉపయోగ పడుతుంది. అలాగే బొగ్గుకు 'యూరియా, డి.ఏ. పి. వరిటి ఎరువులు ను పట్టి ఉంచి
వర్షానికి కొట్టుకొని పోకుండా పట్టి ఉంచుతుంది. తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ. మల్లీశ్వరీ, ఎంపీవో గణేష్ గాంధీ, ఎం ఏ. వో ఎన్. అన్నపూర్ణ, ఎ ఈవో భాగ్యశ్రీ, , ఏపీవో శ్రీనివాస్ , ఏపిఎం రవి కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు రైతులు పాల్గొన్నారు.