పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావు
సోమవారం టేకులపల్లి మండల ప్రెస్ క్లబ్ లో మాజీ మండల అద్యక్షులు దారవత్ బాలాజీ నాయక్ ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ టీచర్స్ సెల్ జిల్లా కన్వీనర్ వి.హాథిరామ్ నాయక్ హాజరై మాట్లాడుతు టేకులపల్లి బిజెపి నూతన అద్యక్షులు గా తేజావత్ శంభు నాయక్ ను అధిష్టానం ఎన్నిక చేసిందని వారు తెలియజేశారు,ఎన్నిక చేసినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి కి,మాజీ జిల్లా అద్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి కి మరియు మనోహర్ బాబు కు, జిల్లా అద్యక్షులు రంగా కిరణ్ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ, భారతదేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్రంలో మూడవ సారి అధికారంలో వచ్చిన తరువాత పెద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది అని ముద్ర రుణాలు ,పీఎం ఇ జి పి ఎన్ ఎల్, ఎం ఉద్యమి మిత్ర ఆవస్ యోజన జీవన్ జ్యోతి, జీవిత భీమా, లేబర్ ఇన్సూరెన్స్, ఇస్మాన్ భారత్, వంటివి అనేక పథకాలు ప్రవేశపెట్టారని వారు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గొగ్గేల వెంకటేశ్వర్లు, ఓబీసీ మూర్చ జామల్ సురేష్, నరేష్, అప్పారావు, నవీన్, బాల, ఆనంద్, తదితరుల పాల్గొన్నారు.