పయనించే సూర్యుడు ఆగస్టు 25 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :సోమవారం ఏవో కార్యాలయం ముందు బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఎరువుల కొరతపై రైతుల పక్షాన పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. టేకులపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, బొమ్మెర్ల వర ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన 20 నెలలు కావస్తున్నా రైతులకు కనీసం యూరియా కూడా సకాలంలో సరఫరా చేయలేని దుస్థితిలో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు పట్ల చిత్తశుద్ధి లేదని వారు ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎన్నడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదన్నారు. రైతు సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరిగితే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేస్తదని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో. టేకులపల్లి మాజీ ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి బోడ బాలు నాయక్, మండల మహిళా అధ్యక్షురాలు రేణుక, మంగే నాయక్, బాలాజీ నాయక్, అప్పారావు, జయరాజ్ ,రైతులు పాల్గొన్నారు.