పయనించే సూర్యుడు జనవరి 26 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య):- మండల కేంద్రమైన చేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా టీడీపీ పార్లమెంటరీ సెక్రటరీ రావి పెంచల రెడ్డి . మండల టీడీపీ అధ్యక్షులు రావి లక్ష్మీ నరసా రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్య క్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.హైమావతి . పాఠశాల చైర్మన్ తిక్కవరపు బుజ్జమ్మ . పిటి శ్రీధర్. ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అలాగే మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం వేడుకలను జండా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు