
పయనించే సూర్యుడు జూన్ 11 (సూళ్లూరు పేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ట్రాన్స్జెండర్లతో ఎమ్మెల్యే ప్రత్యక్షంగా సమావేశమై వారి సమస్యలు అవసరాలు మరియు అభ్యర్థనలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ సమస్యలు ఏమైనా ఉంటే నిర్భయంగా నాకు తెలియజేయండి. ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలు మీకు చేరేలా చర్యలు తీసుకుంటాం. అర్హులైన ట్రాన్స్జెండర్లకు టిడ్కో గృహాలలో ఒక బ్లాక్ కేటాయించే అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు .ట్రాన్స్జెండర్లకు గౌరవప్రదమైన జీవనం కల్పించడం ఉపాధి అవకాశాలు పెంపొందించడం మరియు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో వారికి ప్రాధాన్యత కల్పించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ట్రాన్స్జెండర్ సంఘాల ప్రతినిధులు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు