
పయనించే సూర్యుడు డిసెంబర్ 22 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై తిరుమల రావు హెచ్చరించారు. సోమవారం ఆదురుపల్లి కూడలిలో రోడ్డుపై వాహనాలు నిలిపి ట్రాఫిక్‌కు ఆటంకం కలుగుతుండటాన్ని ఆయన గమనించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను అదుపులోకి తీసుకువచ్చారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. షాపు యజమానులు రోడ్డుపై వాహనాలు నిలిపి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. పోలీసులు ఎంటర్ అవ్వడంతో బస్టాండ్ ప్రాంతం పూర్తిగా ఖాళీ అయింది. ఈ కార్యక్రమంలో ఎస్సైతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.