పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 11
ఆదివాసి సంక్షేమ పరిషత్ ( 274/16) ఆధ్వర్యంలో ఏపీ గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న పశుసంవర్ధక శాఖ (వెటర్నరీ అసిస్టెంట్) ఉద్యోగుల బదిలీలు అక్రమ మార్గంలో నడుస్తున్నాయని. తక్షణమే ఈ బదిలీలను నిలిపివేసి కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని జాతీయ షెడ్యూల్ తెగల కమీషన్(NCST) న్యూఢిల్లీ వారికి, ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ విజయవాడ వారికి మరియు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ విజయవాడ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను శుక్రవారం నాడు ప్రకటన ద్వార తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఏజెన్సీ లోని గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగ నియామకాలన్నీ కూడా జీవో 97 ప్రకారం భర్తీ చేయబడినయని ఈ జీవో ప్రకారం ఉద్యోగ నియమకాలుగాని, బదిలీలు గాని ఏజెన్సీ ప్రాంతాల్లో ముందుగా స్థానిక ఆదివాసుల తోటే 100% భర్తీ చేయాలని నిబంధనలు ఉన్నాయని కానీ అధికారులు వీటిని బేకాథర్ చేస్తూ కొంతమంది ఉద్యోగుల నుండి డబ్బులు తీసుకొని వారికి నచ్చిన చోట ప్లేస్మెంట్స్ కేటాయిస్తున్నారని, కొంతమంది ఉద్యోగులు డైరెక్ట్ గా రంపచోడవరం ఎమ్మెల్యే నుండి రికమండేషన్స్ తెచ్చుకొని ప్లేస్మెంట్స్ కోరుకుంటున్నారని ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని ఇవి ఉద్యోగాల లేక సంత పాట ఎవరికి నచ్చినట్లుగా వారు బదిలీలు కోరుకోవటానికి అని ఆయన ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం ముందుగా ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక ఆదివాసి ఉద్యోగులతోనే భర్తీ చేయాలని ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా మిగిలిన పోస్టులు భర్తీ చేయాలని అలా చేయకుండా అసలు కౌన్సిలింగ్ నిర్వహించకుండా డైరెక్ట్ గా బదిలీల లిస్టు విడుదల చేయటం సరికాదని, ఈ బదిలీల లిస్ట్ కూడా రోజుకో విధంగా మారుతుందని ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ డైరెక్టర్ పశుసంవర్ధక శాఖ వారు పునర్ ఆలోచన చేసి కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి ముందుగా ఏజెన్సీ ప్రాంతంలో కౌన్సిలింగ్ ద్వార ఆదివాసి ఉద్యోగులకు అవకాశం కల్పించాలని ఆ తర్వాత సీనియార్టీ ఆధారంగా ర్యాంక్ కార్డును బట్టి బదిలీలు చేపట్టాలని ప్రస్తుతం విడుదల చేసిన బదిలీల ఉత్తర్వులను రద్దుచేసి కౌన్సిలింగ్ నిర్వహించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ఈ విషయంపై తమ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని అవసరమైతే న్యాయస్థానంలో న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళకి నచ్చిన చోట్ల స్థాన చలనం కల్పిస్తే మిగిలిన ఉద్యోగులు నష్టపోతారని ఇది పూర్తిగా చట్ట వ్యతిరేక చర్యని, అలాగే ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధమని అన్నారు. డబ్బులు ఇచ్చే వారి పైన డబ్బులు తీసుకునే వారి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా చట్టానికి విరుద్ధంగా రికమండేషన్ ఇవ్వటం రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా మానుకోవాలని వీలైతే కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయాలని ఎమ్మెల్యే గారు ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు.