పయనించే సూర్యుడు ఏప్రిల్ 06. ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఈరోజు కారేపల్లి, : సింగరేణి గ్రామపంచాయతీ మండల కేంద్రం అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన చిలుముల రాములు గత కొంతకాలం నుండి డయాలసిస్ వ్యాధితో బాధపడు తున్నాడు. ఇతను కూలి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు ఇతనికి నలుగురు ఆడపిల్లలే. ఈ విషయం తెలుసుకున్న మనసున్న మహారాజు గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా నేను తోడున్నానంటూ అందరి మన్న నలు పొందుతున్న టిఆర్ఎస్ జిల్లా మైనార్టీ సెల్ నాయకుడు షేక్ గౌస్ ఉద్దీన్ ఆయన కు వైద్యం ఖర్చు లకు 5000 వేలరూపాయలు అందజేశాడు ఈ సందర్భంగా ఆయన బాధితుడుని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసు కున్నాడు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుని కృప తనకు తన కుటుంబానికి తోడుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డొంకెన రవీందర్ గౌడ్ మాజీ వార్డు నెంబర్ ఎండి ఖలియుల్ల ఖాన్ తాళ్లూరి కోటి భూక్య చందు నాయక్ ఎల్లబ్బాయి వెంకటి తదితరులు పాల్గొన్నారు