సమయానికి రాకుండా సమయం కాకుండానే వెళ్లిపోతున్న సిబ్బంది.
సిబ్బంది ఇష్టారాజ్యం, పట్టించుకోని జిల్లా వైద్యధికారులు.
మెదక్ జిల్లా
శివ్వంపేట పయనించే సూర్యుడు నర్సాపూర్ నియోజకవర్గం ఇన్చార్జి మహేష్ 10:
ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి వైద్యులను, సిబ్బంది నియమిస్తే, జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్న తీరుకు నిలువెత్తు నిదర్శనం శివ్వంపేట ప్రభుత్వ ఆసుపత్రి.శుక్రవారం గాయలతో పాఠశాల విద్యార్థులు ఆసుపత్రికి రాగా సమయం కాకుండానే ఆసుపత్రి నుండి డ్యూటీ సిబ్బంది అంత వెళ్లిపోవడంతో అటెండర్ సతీష్ వైద్యుని అవతారమెత్తి అన్ని తానై కట్టు కట్టి పంపించాడు. సమయం మధ్యాహ్నం మూడు గంటలు కాకముందే ఆర్థోపెటిక్ డాక్టర్ పవన్ తో పాటు మిగతా సిబ్బంది కూడ విధుల నుండి ఇంటికెళ్లిపోవడం జరిగినది. ఆసుపత్రి విధులకు హాజరయ్యేటప్పుడు సమయానికి రారు, ఇంటికి పోయేటప్పుడు మాత్రం సిబ్బంది ఇష్టమే. జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే శివ్వంపేట ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించడం లేదని రోగులు మండిపడుతున్నారు.