
{పయనించే సూర్యుడు} {ఏప్రిల్15మక్తల్ }
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన జయంతి కార్యక్రమం లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కర్రెమ్ కురుమయ్య అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హాజరైన ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది.విశిష్ట అతిథులుగా హాజరైనటువంటి. ఎల్ రాములు రిటైర్ సర్కిల్ ఇన్స్పెక్టర్. తన సుదీర్ఘ ప్రసంగాన్ని కొనసాగించారు ఏప్రిల్ మాసం మహనీయుల మాసం అని మహాత్మా జ్యోతిరావు పూలే,అంబేద్కర్,బాబు జగ్జీవన్ రామ్ సమాజ ఉద్ధరనకు పాటు పడ్డారు ,అంబేద్కర్ జ్ఞాననికి ప్రతీకగా సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా విశ్వంతరంగా వెలుగొందాడు అని అలాంటి గొప్ప దార్శనికుడు అంబేద్కర్ అని కీర్తించారు.సామాజిక వివక్షతలు నిర్మూలించడంతోపాటుగా విద్యా పరంగా వెనుకబడిన వర్గాలకు హక్కులు కల్పించి సామాజిక చైతన్యానికి పునాదులు వేసిన గొప్ప దార్శనిక విజ్ఞాన రాసి అని కీర్తించారు.బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కాని పైచదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు. అలాంటి పట్టుదలని మీ విద్యార్థి తరానికి ఉండాల్సిన చారిత్రక అవసరం ఉందని ఎల్ రాములు . అభిప్రాయపడ్డారు.ప్రత్యేక ఆహ్వానితులు హాజరైనటువంటి బి కొండయ్య. అంబేద్కర్ లికించినటువంటి రాజ్యాంగం వాటి ఫలాలు పొందాలన్నా ఓటు వజ్రాయుధంగా అవినీతి పరులకు ఓటు వేయకుండా న్యాయం ధర్మం వంటి విలువలు కలిగిన వ్యక్తులకు ఓటు వేసే శక్తి అంబేద్కర్ కల్పించారని పేర్కొన్నారు.ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైనటువంటి మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి. రాజ్యాంగం యొక్క కృషి ద్వారానే మహిళలకు హిందుకోడ్ బిల్లు ద్వారా చట్టసభలలో సముచిత స్థానంతో పాటు మహిళా సాధికారత మరియు చట్టసభలలో మహిళలు రాణిస్తున్నారని అభిప్రాయపడ్డారు.గురుకుల విద్యాలయాల్లో చదువుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గా విద్యార్థిని విద్యార్థులకు విద్యలో రాణిస్తూనే క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థులకు సీల్డ్, అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించినటువంటి సాహిత్య పుస్తకాన్ని అంధించి శాలువతో సన్మానించడం జరిగింది.విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి తమ పేదరికం జయించాలని ఏ సందర్భంలో అయిన అంబేద్కర్ యువజన సంఘం వెన్నుదన్నుగా నిలబడుతుందని హామీ ఇచ్చారు.విద్యార్థుల గురువు. అయినటువంటి ఫిజికల్ డైరెక్టర్ రిటైర్డ్ పిఈటి గోపాల్ సార్ కి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ,బీసీ వసతిగృహాల విద్యార్థి విద్యార్థులకు అంబేద్కర్ సాహిత్యాన్ని శాలువాతో సీల్డ్ తో సన్మానించడం జరిగింది.
ఈ జయంతి కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం కార్యవర్గము ఉపాధ్యక్షులు జుట్ల ఆనంద్, రామానంద, సహాయ కార్యదర్శిలు డోగి గణేష్, కర్రెం రాము,కోశాధికారి కుమార్ విబిషన్, మక్తల్ పురపాలక చైర్ పర్సన్ శ్రీమతి వాకిటి మానస , మక్తల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు జుట్ల చిన్న హనుమంతు. మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ అన్వర్ ,మన్నన్,సాధిక్ బాయ్,శివ రెడ్డి,గాళ్ రెడ్డి,బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షుడు జుట్ల శంకర్,బిఆర్ఎస్ యువనేత జుట్ల సాగర్, అంబేద్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షులు జె.నర్సిములు,HP గ్యాస్ మేనేజింగ్ డైరెక్టర్ మక్తల్ పురపాలక కౌన్సిలర్లు పికే నరసింహ,కో ఆప్షన్ మెంబెర్ లక్ష్మన్,కాంగ్రేస్ పార్టీ నాయకులు,కట్ట సురేష్ గుప్తా మాజీ ఉప సర్పంచ్,వాకిటి శ్యాము, బోయ వెంకటేష్ మార్కెట్ డైరెక్టర్ వాకిటి ఆంజనేయులు, జనసేన పార్టీ బాధ్యులు మణికంఠ గౌడ్ ,వివిధ రాజకీయ పార్టీ ప్రముఖులు, ప్రజాసంఘాల నాయకులు భుట్టో,భగవంతు విద్యార్థి సంఘాల నాయకులు భాస్కర్, ఎంఐఎం పార్టీ బాధ్యతలు జంషేర్ అలీ, అడ్వకేట్ ఆడేం శ్రీనివాసులు, వివిధ సామాజిక కులాల వర్గ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
