ప్రజా కవి జయరాజు రాక
అంబేద్కర్ విగ్రహావిష్కరణ మరియు బహిరంగ సభ గోడ పత్రికలు మరియు కరపత్రాల విడుదల
//పయనించే సూర్యుడు// న్యూస్ మే22//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
అంబేద్కర్ యువజన సంఘం, పస్పుల గ్రామ ఆధ్వర్యంలో మక్తల్ పట్టణ కేంద్రంలోని విశ్రాంతి గృహం నందు ఏర్పాటుచేసిన సమావేశంలో ఈ నెల 25 వ తారీఖున పసుపుల గ్రామంలో జరగబోయే భారత రత్న డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మరియు బహిరంగ సభను కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ గోడపత్రికలు మరియు కరపత్రాలను విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం,పసుపుల గ్రామ అధ్యక్షులు మాట్లాడుతూ అంటరాని కులంలో పుట్టిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిన్నతనం నుండి అనేక రకాల అవమానాలను ఎదుర్కొంటూ గొప్ప గొప్ప చదువులు చదివి, అంటరాని జాతులు ఆత్మగౌరవంతో జీవించేలా ఒకవైపు మనువాదులతో మరోవైపు బ్రిటీష్ వాళ్ళతో పోరాడిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ ని అంతేకాకుండా ఈ దేశంలో అనాదిగా వేలునుకున్న వర్ణవ్యవస్థ కారణంగా వంటింటికే పరిమితమైన మహిళల హక్కులకై చట్టసభల్లో హిందుకోడ్ బిల్లు రూపంలో కోట్లాడిన గొప్ప స్త్రీవాది అంబేద్కర్ అని కీర్తించారు. కార్మికులను శ్రమ దోపిడి నుండి విముక్తి కల్పిస్తూ ఎనిమిది గంటల పనినీ చట్టబద్ధం చేసేలా కృషి చేసిన నిజమైన కార్మిక నాయకుడు, ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించి దేశంలో బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారంలోకి రావాలని కాంక్షించిన బహుజన మేధావి,రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్పూర్తినీ ప్రతిబింబిన్చేలా పసుపుల గ్రామంలో ఏర్పాటు చేసిన డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మరియు బహిరంగ సభ ఈ నెల 25వ తారీఖు సమయం 4. గంటలకు* జరుగబోయే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రజాకవి జయరాజు మరియు మక్తల్ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి మరియు అదే విధంగా వక్తలుగా డి. చంద్రశేఖర్ కేఎన్పీఎస్ జిల్లా అధ్యక్షులు, మద్దిలేటి టీవీవీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, డిజి సూర్యచంద్ర డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కె పృథ్వీరాజ్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ అధ్యక్షులు* మరియు వివిధ ప్రజాసంఘాల నాయకులు* రాబోతున్నారని అదే విధంగా జక్క గోపాల్ గారి కళాబృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలియజేస్తూ…ప్రజాస్వామిక వాదులు,నాయకులు,మక్తల్ మండల బహుజన, మైనారిటీ, అగ్రకులాలలోని పేదలు అందరూ పెద్ద ఎత్తున పసుపుల గ్రామానికి తరలి వచ్చి అంబేద్కర్ విగ్రహావిష్కరణ మరియు బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం పసుపుల అధ్యక్షులు చిన్న నర్సింలు, ప్రధాన కార్యదర్శి కె నర్సింలు, అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ అధ్యక్షులు పృథ్వీరాజ్, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షులు డి చంద్రశేఖర్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు జెర్గల్ నాగేష్, పుడమి ఫౌండేషన్ చైర్మన్ వేంకటపతి రాజ్,జ్యోతిరావు పూలే బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి ఈసరి శ్రవణ్ కుమార్,జోగిని వ్యతిరేక పోరాట సమితి నంగి నరసింహులు కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు టి.లింగన్న,జిల్లా నాయకులు విజయ్ కుమార్ వివిధ సంఘాల నాయకులు,మరియు అంబేద్కర్ యువజన సంఘం పసుపుల కార్యవర్గ సభ్యులు బి నర్సింలు, రాజు నరేష్ పరశురాం రమేష్ వెంకటేష్, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.