పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 2, ఆదోని టౌన్ రిపోర్టర్ గుమ్మల బాలస్వామి
_
ఆదోనిలో డి.ఎస్.పి హేమలతను ఆదివారం ఆదోని డివిజన్ ఎస్సీ/ఎస్ టి విజలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్, ఎరుకుల రవికుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆదోని డివిజన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు, హత్యలు పెరుగుతున్నాయని, గ్రామాలలో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కేసులు వేగవంతంగా విచారణ చేయాలని, ఆదోని డిఎస్పీ ను కోరారు.