పయనించే సూర్యుడు జనవరి 30 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్యసాయి జిల్లా ఉప్పు సత్యాగ్రహం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బుక్కపట్నం డిగ్రీ కళాశాల ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించిన సత్యసాయి డిగ్రీ కళాశాల స్టాఫ్ మరియు సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చూపినటువంటి మార్గం ఐకమత్యమే మహాబలం, ప్రేమే మార్గం, అనే విధంగా మన భారతదేశానికి ఆంగ్లేయలతో పోరాడి స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి, అహింస అనే మార్గంలో, సత్యాగ్రహం ద్వారా పోరాటం చేసి మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకుడు సయ్యద్ బాషా, వాజిద్ భాష, సామకోటి ఈశ్వరయ్య, వెంకటరాముడు, రమణ తదితరులు వీరితో పాటు ఉపాధ్యాయులు మరియు అధికారులు పాల్గొన్నారు