// పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 12 నారాయణపేట జిల్లా బ్యూరో //
నారాయణపేట జిల్లా కేంద్రంలో తేది 11.09.2025 నాడు
పంటకోత ప్రయోగాలపై డిజిటల్ యాప్ ద్వారా శిక్షణ తరగతులను గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీటింగ్ హాల్ నందు ముక్య ప్రణాళిక అధికారి యోగానంద్ సింగు,అద్యక్షతన నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యం.పి.స్.ఓ మరియు ఏ.ఈ.ఓ లు వారికి కేటాయించిన గ్రామాలలో పొరపాటు లేకుండా పంట కోత ప్రయోగాలు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. సేకరించిన వివరాలను సమయానికి DGCES యాప్ నిర్వహిస్తున్నప్పుడు ప్రాథమిక కార్యకర్తలు తీసుకోవాల్సిన జాగ్రతలు,సూచనలు తెలియజేశారు. సేకరించిన వివరాలు సమయానికి DGCES యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. పంటకోత ప్రయోగాలు కేవలం సర్వే మాత్రమే కాకుండా, రైతులకు ,ప్రభుత్వానికి ఉపయోగకరమైన అంచనాలు వేయడానికి ఉపయోగపడుతాయని,పంటల దిగుబడిని అంచనా వేయడానికి, ప్రభుత్వం వ్యవసాయ పంటలపై తగు విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడుతుందన్నారు. మార్కెట్ ధరలు ఎగుమతులు, దిగుమతులు స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ గణాంక అధికారులు B నర్సిములు, G శ్రీదేవి, యం.పి. స్.ఓ లు , ఏ.ఈ.ఓ లు సంబందిత అధికారులు పాల్గొన్నారు.