డీజే ఆపరేటర్లతో సమావేశంలో మాట్లాడుతున్న ఎస్ఐ సాయన్న…
రుద్రూర్, ఆగస్టు 5 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
సీపి సాయి చైతన్య ఆదేశాల మేరకు రుద్రూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్సై సాయన్న మంగళవారం డీజే యజమానులు, ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం రోజున డీజే నిషేధించబడిందని, కావున డీజే బాక్సులు పెడితే కఠిన చర్యలు తీసుకుని, డిజే బాక్స్ లను సీజ్ చేస్తామని అన్నారు.