
పయనించే సూర్యుడుD.29.7.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టికే గంగాధర్.-ఆర్టీసి విశ్రాంత ఉద్యోగుల సంఘం వెల్లడి.
నిజామాబాద్,ఆర్టీసీ సంస్థలో పనిచేసి పదవి విరమణ పొందిన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 4వ తేదీన బస్ భవన్ ముట్టడి కేంద్రాన్ని చేపడుతున్నామని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనందం వెల్లడించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సమస్యలు 2013 ఎంప్లాయిస్ పిఎఫ్ కంట్రిబ్యూషన్ ఇవ్వనందువలన పెన్షన్, 2017,2021 ఆర్ పి ఎస్ జీతం, డిఫరెన్స్ ఆఫ్ గ్రాడ్యుటి, డిఫరెన్స్ లీవ్ ఎన్ క్యాష్మెంట్ ఏరియర్స్ పెండింగ్లో ఉన్నాయని,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని వాపోయారు. తెలంగాణ ఉద్యమ సాధనలో ఆర్టీసీ ఉద్యోగులు చురుకుగా పాల్గొన్నారన్నారు. ఆర్టీసీలో పింఛన్ రాక, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్య సమస్యలతో దాదాపుగా 300 మంది చని పోయారన్నారు. తాము బతుకున్నప్పుడే రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఒక్కొక్కరికి పది నుండి పదిహేను లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందన్నారు.ఆగస్టు మూడవ తేది వరకు తమ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా 17వేల విశ్రాంత ఉద్యోగులు బస్ భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
జిల్లా అధ్యక్షులు రాజన్న మాట్లాడుతూ మా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఎంపీలను ఎమ్మెల్యేలను కలిసి మెమోరండాలు ఇవ్వడం జరిగిందన్నారు. సంస్థలో పనిచేసి చనిపోయిన వారి కుటుంబాలకు అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరూతున్నమ్మన్నారు. స్టేట్ జనరల్ సెక్రెటరీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూసంస్థలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన తర్వాత అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు.వేతన సవరణ జరిగిన ఇప్పటివరకు డబ్బులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పి రామచందర్, కార్యదర్శి ఎస్ పోశెట్టి, కోశాధికారి సుదర్శన్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ఎల్ నారాయణ, డి ఎస్ బి రాజు, జీవి చారి, ఆర్. నర్సింలు, జిల్లాలోని అన్ని డిపోల అధ్యక్షా కార్యదర్శులు పాల్గొన్నారు.