నేడు జనగాం లో పార్టీ శ్రేణులతో కలిసి సమావేశం కానున్న అబ్జర్వర్లు
( పయనించే సూర్యుడు అక్టోబర్ 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా, భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణలో అన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీలకు (డిసిసిలు) కొత్త అధ్యక్షులను నియమించుటకు అబ్జర్వర్ లను నియమించింది.అందులో భాగంగా జనగాం, మహబూబాబాద్ జిల్లాలకు అబ్జర్వర్ గా షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ నియమితులయ్యారు. అబ్జర్వర్ లుగా ఒడిశా కు చెందిన మాజీ శాసన సభ్యులు దుబాసి పట్నాయక్,శ్రీకాంత్ యాదవ్, అవేజ్ ఉన్నారు. వారం రోజుల పాటు మండల,తాలూకా,జిల్లా స్థాయిలో పార్టీ శ్రేణులతో సమావేశమై అందరి అభిప్రాయాలను సేకరించి డీసీసీ అధ్యక్ష పదవికి అర్హులైన వారి జాబితాను ఏఐసిసి కి సమర్పించనున్నారు.