
పయ నించు సూర్యుడు జూలై 2: (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డెంగ్యూ వ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలనీ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ వై ఖోమ్ నైడియా దేవి తో కలిసి పోస్ట్రను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, డెంగ్యూ నివారణకు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం, వారానికి ఒకసారి డ్రై డేగా పాటించడం, దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డెంగ్యూ వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. జ్వరం వచ్చిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు.జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్ నైడియా దేవి మాట్లాడుతూ, గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ప్రజల సహకారంతోనే డెంగ్యూ నియంత్రణ సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ కె ఎన్ శ్రీనివాస్ రామ్మోహన్ రావు ఏడుకొండలు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.