పయనించే సూర్యుడు నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం, డోన్ పట్టణంలోని 7 వ వార్డులో ఉన్న సి హెచ్ సి భవనం తక్షణ మరమ్మత్తుల కోసం ఎంపీ ల్యాండ్స్ నిధులు రూ. 6 లక్షలు మంజూరు చేస్తున్నట్లు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి సోమవారం తెలిపారు. ఈ మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అవసరమైన పరిపాలన అనుమతులు కూడా ఇవ్వడం జరిగిందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు.ఎంపీ లాడ్స్ 2024-25. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఏం.పి, 18వ ఎల్, ఎస్ నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గం- 2024-25 సంవత్సరానికి పరిపాలనా అనుమతి ప్రకారం ప్రతిపాదించబడిన పనుల జాబితా-ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని, సంబందిత ఇంజనీర్లు సకాలంలో పనులు పూర్తి చేయాలని, పనులు నాణ్యతగా చేయాలని ఎంపీ కోరారు.