రుద్రూర్, మే 22 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో భాగంగా రుద్రూర్ పోలీసులకు పట్టుబడిన సులేమాన్ నగర్ గ్రామానికి షేక్ శాలని, తండ్రి పేరు మొహిన్ అనే వ్యక్తిని బోధన్ కోర్టులో హాజరు పరుచగా ఒక రోజు జైలు శిక్ష, రెండు వేల రూపాయలు జరిమానా విధించినట్లు గురువారం బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి తీర్పు వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట రీత్యా చర్యలు తప్పవని రుద్రూర్ ఎస్సై పి.సాయన్న పేర్కొన్నారు.