
పయనించే సూర్యుడుD.12.9.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండలం లో గ్రామ పొలిమేరలోకి చేరిన మత్తు పదార్థాలను తరిమి కొట్టి డ్రగ్స్ రహిత సమాజం కోసం కంకణ బద్దులవుదాం అని ఈగల్ ఫోర్స్ అడ్వైజర్ కొండవీటి శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం భీంగల్ మండలం లింబాద్రిగుట్ట దేవస్థానంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ ప్రోగ్రాం కు విచ్చేసిన ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకోవడం వలన జీవితాలు అతలాకు తలం అవుతున్నాయని. కొందరు లాభాపేక్షతో విక్రయాలు కొనసాగిస్తూ ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్నారని ఆయన విమర్శించారు. చిన్నారులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ఆయన కోరారు. ఎస్సై శంకర్ మాట్లాడుతూ గ్రామాల్లో గాంజా తో పాటు మత్తు పదార్థాలు విక్రయిస్తే తగిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. గంజాయి విక్రాయిలర్ విషయాన్ని తెలియపరిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. గంజాయి సేవించడం వల్ల అనారోగ్యానికి గురవుతారని ఆయన వివరించారు గాంజా సేవిస్తూ పట్టుబడితే భవిష్యత్తు అందాకారమవు తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఈగల్ ఫోర్స్ టీం అడ్వైజర్స్ ఉట్నూర్ సాగర్, అడ్వాల శ్రీనివాస్, పంతుల మనోహర్, కొనింటి అనిల్ కుమార్, మీనుగు నాగరాజు, శెట్టి శ్రీనివాస్, భీంగల్ పోలీస్ స్టేషన్ SI తిరుపతి, శంకర్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.