
పయ నించే సూర్యుడు జనవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి ఢిల్లీ డాక్టర్
ఆదినారాయణ దంపతులు సిద్దా రాఘవరావు దంపతులను ముఖ్య అతిథులుగా న్యూఢిల్లీలో జరగబోయే ఉగాది ఉత్సాహ వేడుకలకు వారిన ఆహ్వానించినారు అనంతరం వారు దంపతులను సన్మానించినారు
ఒంగోలు జనవరి 21 న్యూస్ ప్రతినిధి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలకు దగ్గర అయ్యేలా చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని సాహిత్య సంస్థల నిర్వాహకులు ఆదిలీల ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆదినారాయణ అన్నారు. ఒంగోలులో వారు వివిధ జాతీయ సంస్థల ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం జరిపారు ఈ కార్యక్రమంలో ఎల్సిఈఎస్ కళానిలయం జాతీయ సెక్రెటరీ బుచ్చేస్వర రావు మరియువో వా వాటర్ సీఈవో విద్యాధరరావు మరియు ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు మంగళదీప్ షో రూమ్ అధినేత కాశీ విశ్వనాథ్ తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావన ఉండాలనే అప్పుడే మంచి విలువలు పెరుగుతాయని అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచన పెరగాల్సిన అవసరం కూడా ఉన్నదని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల మక్కువ చూపాలని అన్నారు, పండుగలు సమయంలోనే కాక ఇతరత్రా కార్యక్రమాల్లో కూడా ప్రజల్లో చైతన్యం రావాలంటే ప్రతి కుటుంబంలో కూడా విలువలు సాంప్రదాయం పట్ల గౌరవం కలిగేలా పిల్లలకు కొత్త విషయాలు అలాగే విలువలతో కూడిన మాటలు నేర్పాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. పిల్లలకు బాల్యం నుండి అలాగే చదువుతో పాటు ఆధ్యాత్మిక భక్తి భావం పెరిగేలా చూడాల్సిన అవసరం కూడా ఉన్నదని అన్నారు. కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు దేవాలయాలు పట్టణాల్లో కూడా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ దిక్సూచి ఇలా పనిచేస్తున్న వారందరూ కూడా మంచి సంప్రదాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు
