న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (Delhi Assembly Elections) దగ్గరపడుతుండటంతో ఓటర్ల తుది జాబితా(voter list)ను ఢిల్లీ ఎన్నికల కమిషన్ సోమవారంనాడు విడుదల చేసింది. అప్డేట్ చేసిన జాబితా ప్రకారం దేశ రాజధానిలో 1,55,24,858 మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. వీరిలో 84,49,645 మంది పురుష ఓటర్లు, 71,73,952 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబిజాలో లేనివారు 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లేదని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎంత మంది కొత్త ఓటర్లను చేర్చారు, ఎంతమంది పేర్లను తొలగించారనే వివరాలు తాజా ఓటర్ల తాబితాలో ఈసీ పొందుపరిచింది.