ఏఓఐ నాయకత్వంలో దేశ రాజధానిలో ధర్నా
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12 మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్ రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్) ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో ఈరోజు ఢిల్లీలోని పార్లమెంట్ ముందర జరిగిన మహా ధర్నాలో మంచిర్యాల ఎల్ఐసి ఏజెంట్లు పాల్గొన్నారు. బీమా ప్రీమియంపై జీఎస్టీని రద్దు చేయాలని, బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితి పెంపును విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ రాష్ట్రాలనుండి వచ్చిన ఏజెంట్లు ధర్నా నిర్వహించారు. ఏజెంట్ల కమిషన్ను తగ్గించే ప్రయత్నాలను విరమించుకోవాలని, ఏజంట్ల ప్రయోజనాలకు భంగం కలిగించే బీమా సుగం పోర్టబలిటీని రద్దు చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఎల్ఐసి ఏజెంట్ల ప్రయోజనాల రక్షణ కోసం సంక్షేమ చర్యలు చేపట్టాలని డిమాండ్లపై పోరాటాన్ని ఉధృతంగా చేపట్టనున్నామని ఈ సందర్భంగా ఏఓఐ సంఘం కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు పి. రాజబాబ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల బ్రాంచ్ బాధ్యులు గంగధారి తిరుపతి, కటకోజ్వల మహేష్, లక్మినారాయణ, తిరుపతయ్య, స్వామి, వేణు, అశీర్ విల్సన్, రాజు, తదితరులు పాల్గొన్నారు.