
పయనించే సూర్యుడు, డిసెంబర్ 07( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )
చెరుకుపల్లి రాకేష్రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో సర్పంచ్ అభ్యర్థి, మాజీ సర్పంచ్ బైరి రమేష్ భారీ ఎత్తున ఇంటింట ప్రచారంతో ఎన్నికల రంగాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకు బ్యాలెట్ నెంబర్ 2 – కత్తెర గుర్తు లభించడంతో ప్రచారంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.బైరి రమేష్ గతంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ, ప్రజలు స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. గృహాల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ, అభివృద్ధి కొనసాగింపుకు మరో అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రచారంలో మహిళలు, యువత, పెద్దలు విస్తృతంగా చేరడంతో టెక్స్టైల్ పార్క్ ప్రాంతంలో ఎన్నికలకు మరింత జోరుగాఉంది. బైరి రమేష్ చేసిన ప్రధాన అభివృద్ధి పనులుటెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో రోడ్లు & డ్రైనేజీ నిర్మాణంవీధి విద్యుత్ దీపాల ఏర్పాటు, లైట్లు పనిచేయని ప్రాంతాల్లో మరమ్మతులుశుద్ధ తాగునీటి సరఫరాకి చర్యలు, పైపులైన్ సమస్యల పరిష్కారంకాలనీలో పారిశుధ్య కార్యక్రమాల బలోపేతంపేద కుటుంబాలకు ఇళ్ల పంపిణీ, సంక్షేమ పథకాల అందుబాటుఅంగన్వాడీ–పాఠశాలలకు అభివృద్ధి పనులు, మౌలిక వసతులుప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల వెంటనే పరిష్కారం