
పయనించే సూర్యుడు, డిసెంబర్ 12( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తంగళ్ళపల్లి మండలంలో ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. తేదీ 12-12-2025 సాయంత్రం 05:00 గంటల నుంచి 13-12-2025 సాయంత్రం 05:00 గంటల వరకు – ఇతర గ్రామాలకు చెందిన కొత్త వ్యక్తులు తంగళ్ళపల్లి మండల పరిధిలో ఉండకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా కొత్త వ్యక్తులు పట్టుబడితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం ఈరోజు సాయంత్రం 05:00 గంటల నుంచి ఎలాంటి ప్రచారం, గుంపులు గుంపులుగా తిరగడం నిషేధం.ముగ్గురు లేదా నలుగురు కంటే ఎక్కువ మంది కలిసి ప్రచారం చేయడం పూర్తిగా నిషేధం. ఈ సూచనలు ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వారి మీద చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.