

పయ నించే సూర్యుడు జూలై 9 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: కాట్రేనికోన మండలం ఎపి రాష్ట్ర ఆక్వా రైతు సంఘం కార్యదర్శి త్వటపల్లి నాగభూషణం తండ్రి వెంకటేశ్వరరావు సంస్మరణ కార్యక్రమం బుధవారం చేయ్యేరులో నిర్వహించారు. పలువురు నాయకులు వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన తండ్రి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు పూల మొక్కలు, జామ మొక్కలను పంపిణీ చేశారు.పితృ వియోగంతో బాధపడుతున్న జిల్లా కాపు నాయకులు, ఏపి ఆక్వా రైతు సంఘం కార్యదర్శి త్వటపల్లి నాగభూషణంను వివిధ పార్టీలకు చెందిన నాయకులు పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఓగూరి భాగ్యశ్రీ, ఏపి రాష్ట్ర హస్త కళల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ ఆర్.ఎస్ ప్రసాద్, ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బద్రి రమా, నాయకులు దూళిపూడి చక్ర, గణేశుల బ్రహ్మానందం, సుధా బాబురావు, మద్దినశెట్టి పురుషోత్తం, మోకా బాల ప్రసాద్, గాలిదేవర బుల్లి, లంకలపల్లి జమ్మి, కాయల బలరాం, సుధా రాఘవేంద్ర, మణి కుమార్, నవరపు వెంకట్, భీమాల సూర్య నాయుడు, నంద్యాల చంటి, కాయల సూరిబాబు, మాగాపు పట్టాభి తదితరులు పాల్గొన్నారు