
అఖిల భారత రైతు కూలీ సంఘం
పయనించే సూర్యుడు అక్టోబర్ 28 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి : మంగళవారం రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, తడిసిన ధాన్యం ను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు టేకులపల్లి మండల కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి , సీనియర్ అసిస్టెంట్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం మండల అధ్యక్షులు గుగుతోతు. రాంచందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో CPI ML న్యూడేమెక్రసి టేకులపల్లి మండల కార్యదర్శి కల్తీ. వెంకటేశ్వర్లు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు భూక్య హర్జ్య మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటను తక్కువ ధరలకే కోనుగోలు చేసి నిలువ దోపిడీ కి పాల్పడుతున్నారని. మార్కెటు సంక్షోభాలను స్పష్టిస్తున్నారు. వ్యవసాయ పెట్టుబడిని, రైతుల రెక్కల కష్టాన్ని లెక్క కట్టి మెుక్కజోన్న లకు రూ. 2928 పత్తి కి రూ. 10075 , వరి కి 2389 లు మద్దతు ధర ను ప్రభుత్వం నిర్ణయించాలి. కాని మన పాలకులు కార్పొరేట్ కంపెనీల షరతులకు లోబడి తక్కువ మద్దతు ధర నిర్ణయించడం ద్వారా పేద రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు అన్నారు. మండలంలో ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ కు సంబంధం లేకుండా ఏర్పాటు చేస్తున్నా పత్తి చిల్లర కౌంటర్లను వెంటనే ఎత్తివేయాలని , అనుమతి లేకుండా చిల్లర కౌంటర్లు ఏర్పాటు చేసిన వారి పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ వ్యాపారుల దోపిడీ ని అరికట్టాలని. వీరి నుండి రైతులకు జరుగుతున్న నష్టాన్ని లెక్క కట్టి ప్రభుత్వమే చెల్లించాలని. అదే విధం అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని . తడిసిన ధాన్యం ను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం PYL తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్, అఖిల భారత రైతు కూలీ సంఘం మండల నాయకులు భూక్య. నర్సింగ్, వెంకట్రాం, రాంచందర్, రాం కొట్టి,కిర్య, మంగీలాల్, భీక్య, స్వామి, సామ్య తదితరులు పాల్గొన్నారు.