కమిషనర్ ను సన్మానించిన మాజీ కౌన్సిలర్ అపరాధ ముత్యం రాజు..
పయనించే సూర్యడు // మార్చ్ // 13 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్// కుమార్ యాదవ్..
హుజూరాబాద్ మున్సిపాలిటీలో గురువారం నాడు 5 వార్డులో 19వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త విభజనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పాల్గొని ప్రజలకు చెత్త సేకరణ, విభజన అవసరాన్ని వివరించారు.ఈ సందర్భంగా హుజురాబాద్ తాజా మాజీ 5 వార్డ్ కౌన్సిలర్ అపరాధ ముత్యం రాజు కమిషనర్ సమ్మయ్యను సన్మానించారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో ఆయన కృషిని ప్రశంసిస్తూ, పట్టణ పరిశుభ్రతకు అందరూ సహకరించాలని ప్రజలను కోరారు.కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, స్థానికులు పాల్గొని చర్చల్లో పాల్గొన్నారు. కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ..హుజూరాబాద్ పట్టణాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు ప్రతి ఇంట్లో తడి చెత్త, పొడి చెత్తను విడదీసి ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.