పయనించే సూర్యుడు పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 18
రంపచోడవరం మండలం నరసాపురం గ్రామంలో అక్రమంగా కొనసాగుతున్న బ్లాక్ మెటల్ క్వారీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా గ్రామ సభ నిర్వహించి అక్రమ దారులతోటి ఎమ్మార్వో, ఆర్ఐ వీఆర్వో , కుమ్మక్కై తప్పుడు నివేదికను ఇచ్చారని తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నరసాపురం మెటల్ క్వారీ ని తక్షణమే మూసివేయాలని కోరుతూ నరసాపురం గ్రామస్తులు రంపచోడవరం ప్రాజెక్టు అధికారి వారికి మరియు సబ్ కలెక్టర్ వారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు మాట్లాడుతూ ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న క్వారీ పై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని వారు ఆవేదన వ్యక్తపరిచారు. సమస్య పరిష్కరిస్తామని గ్రామ సభ పెట్టిన రెవెన్యూ అధికారులు అక్రమదారులకే కొమ్ముకాస్తూ తమకు అన్యాయం చేశారని ఉన్నత అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్పందిస్తూ నూతనంగా వచ్చిన సబ్ కలెక్టర్ వారిని పంపించి విచారణ జరిపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు ఫిర్యాదుదారులు ప్రకటనలో తెలిపారు. అనంతరం ఫిర్యాదుదారులు మెటల్ క్వారీని ఉద్దేశించి మాట్లాడుతూ తప్పుడు లీజు తోటి అన్ని శాఖల అనుమతులు లేకుండా అక్రమంగా నరసాపురం లో రెండు మెటల్ క్వారీలు నడుస్తున్నాయని, ఆ రెండు మెటల్ క్వారీలు కూడా ఒకే వ్యక్తి నిర్వహిస్తున్నారని దానికి గ్రామంలో కొంతమంది బినామీలుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. క్వారీ నిర్వహణదారులపై బినామీ దారులపై చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా అధికారులను, ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయ నాయకులకు మరి కొంతమంది అధికారులకు ముడుపులు అప్పజెప్పితో ఎద్దేచగా అక్రమార్కులు నరసాపురం లో మెటల్ రాయిని దర్జాగా దోచుకుంటున్నారని దీనిపై కింది స్థాయి నుంచి ఉన్న స్థాయి అధికారుల వరకు ఇప్పటికే ఫిర్యాదు చేసి ఉన్నామని, అయినప్పటికీ మండల స్థాయి అధికారులు మాత్రమే వచ్చి అక్రమార్కులతో చేతులు కలిపి తూతూ మంత్రంగా గ్రామసభలు నిర్వహించి గ్రామంలో మేము రాజీ పడ్డట్టు తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆవేదన వ్యక్తపరిచారు. కిందిస్థాయి అధికారులతోటి ఈ సమస్య పరిష్కారం కాదని ఉన్నత స్థాయి అధికారులు మా గ్రామానికి వచ్చి ఆ క్వారీ వల్ల గ్రామానికి జరుగుతున్న నష్టం రైతులకు జరుగుతున్న నష్టం చూడాలని అదేవిధంగా క్వారీలో జరుగుతున్న లావాదేవులపై నిధులు దుర్వినియోగం విచారణ జరపాలని వారు కోరారు. క్వారీలో జరిగే నిధుల లావాదేవులపై ఎటువంటి ఎకౌంటబిలిటీ లేదని ప్రతి సంవత్సరం జరగాల్సిన ఆడిట్ జరగటం లేదని ఆడిట్ జరిగితే క్వారీలోని తప్పు తడకలన్నీ కూడా బయటకు వస్తాయని సంబంధిత శాఖవారని నిర్వహణదారులు డబ్బులతో మేనేజ్ చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తపరిచారు. క్వారీ నిర్వహణదారులు ఎటువంటి పరిమిషన్ లేకుండా గ్రామస్తులు ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా మెటల్ క్వారీని బాంబ్ బ్లాస్టింగ్ చేయటం వలన గ్రామంలో ఇల్లు బీటలు భారీ కూలిపోయే పరిస్థితికి వస్తున్నాయని, ఎప్పుడు ఏ రాయి వచ్చి ఎవరి మీద పడుతుందో అని భయంతో ఉంటున్నామని వారి ఆవేదన వ్యక్తపరిచారు. క్వారీ వలన చుట్టుపక్కల ఉండే రైతులకు పంట నష్టం జరుగుతుందని పర్యావరణ కాలుష్యం కూడా జరుగుతుందని కావున దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉన్నత అధికారులు కూడా తమ ఫిర్యాదును పట్టించుకోకుంటే తాము ఇంకా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు ఫిర్యాదును పీవో, సబ్ కలెక్టర్ వారితో పాటు జిల్లా కలెక్టర్, డైరెక్టర్ మైనింగ్ అండ్ జియాలజీ విజయవాడ వారికి మెయిల్ ద్వారా పంపించినట్లు ఫిర్యాదుదారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొడియం. అరుణ కుమారి, సారపు. దుర్గ భవాని, కోటం. పండమ్మ కోసు. దేవి శ్రీదేవి , చోడి. అనిల్ కుమార్ దొర ఇట్లు పోడియం అరుణకుమారి నరసాపురం గ్రామం రంపచోడవరం మండలం.