

పయనించే సూర్యుడుD.6.8.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్..బాల్కొండ నియోజకవర్గం లో భీమ్గల్ మండల్
ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ తల్లిపాలు బిడ్డల ఆరోగ్యానికి క్షేమకరమని దీన్ని ముర్రి పాలు అని అంటారని బిడ్డ రోగ నిరోధక శక్తికి బరువుకు ఉపయోగపడుతుందని ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ అన్నారుఈరోజు గురువారం రోజున ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గోనుగోప్పుల గ్రామంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవ కార్యక్రమంలో పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతపై వివరించారు.. తల్లిపాలు బిడ్డ మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుందని, జీర్ణం తొందరగా అవుతుందని, మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు ఇవ్వాలని దీనివల్ల తల్లి కూడా రొమ్ము క్యాన్సర్ లాంటివి రాకుండా నిరోధకంగా పనిచేస్తుందని తెలిపారు..అదేవిధంగా సెక్టార్ పరిధిలోని గర్బణులకు శ్రీమంతo కార్యక్రమం అదేవిధంగా 6 నెలల దాటిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమము తహసిల్దార్ కిరణ్ తో కలిసి నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో తహసిల్దార్ కిరణ్ కుమార్ గ్రామ సర్పంచ్ చరణ్ గౌడ్ భీంగల్ సిడిపిఓ జ్ఞానేశ్వరి ఏ సి డి పి ఓ జ్యోతి సూపర్వైజర్ శారద అంగన్వాడీ టీచర్లు గర్భిణీలు బాలింతలు పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు