కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని పట్టుకొని నిలబడ్డం..
కష్టం మాకు పదవులు వాళ్ళకా గంగారం మహేష్ సీనియర్ నాయకులు..
పయనించే సూర్యుడు// ఫిబ్రవరి// 15// హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్ : గంగారం మహేష్ మాట్లాడుతూ.. ఇల్లంతకుంట మండలంలో ,గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చేంతవరకు తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వీడకుండా ఎంతమంది డబ్బు ఆశ చూపెట్టి పార్టీ మారమని చెప్పిన గాని మారకుండా నా యొక్క సొంత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నానన్నారు.గతంలో ఉప ఎన్నిక సమయంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ వీడి టిఆర్ఎస్ పార్టీలో బిజెపి పార్టీలో డబ్బులకి అమ్ముడుపోయిన వ్యక్తులకు మండల అధ్యక్షులు గా,గ్రామ శాఖ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు నామినేటెడ్ పోస్టులు పార్టీలు మారిన వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిం దన్నారు .కష్టకాలం నుండి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న మాలాంటి యువతకి ఎలాంటి గుర్తింపు లేకుండా ఉన్నామన్నారు. దయచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన మాలాంటి యువతకి కార్యకర్తలకి న్యాయం చేకూరేలా మాలాంటి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు మీరందరూ సపోర్ట్ గా ఉండాలని ఇల్లంతకుంట మండల సీనియర్ నాయకులు గంగారం మహేష్ కోరారు.